Vijayawada: వైసీపీ నేత యలమంచిలి రవి గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. రూ.40 లక్షల ఆస్తి నష్టం!

  • ఆదివారం సాయంత్రం అగ్నిప్రమాదం
  • కాలిబూడిదైన పెళ్లిళ్ల సామగ్రి
  • కుట్ర ఉందన్న రవి
విజయవాడకు చెందిన వైసీపీ నేత యలమంచిలి రవికి చెందిన ఓ గోడౌన్‌లో ఆదివారం సాయంత్రం సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో రూ.40 లక్షల ఆస్తి కాలి బూడిదైంది. వైసీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త అయిన రవి పటమట డొంక రోడ్డులో గోడౌన్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఆచంట గౌతమ్ అనే వ్యక్తి పెళ్లిళ్లకు కావాల్సిన సామగ్రిని భద్ర పరిచాడు.

ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో గౌతమ్ భద్రపరిచిన రూ.40 లక్షల విలువైన పెళ్లిళ్ల డెకరేషన్ సామగ్రి అగ్నికి ఆహుతైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు వాహనాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడూతూ అగ్ని ప్రమాదం వెనక కుట్ర ఉందని, ఎవరో కావాలనే నిప్పు పెట్టారని ఆరోపించారు.
Vijayawada
Yalamanchili Ravi
Fire Accident
YSRCP

More Telugu News