Shabbir Ali: కేసీఆర్‌వి మాటలు తప్ప చేతలుండవు!: షబ్బీర్ అలీ

  • హైదరాబాద్‌ను అభివృద్ది చేసింది కాంగ్రెస్సే
  • సెపరేట్ మేనిఫెస్టో సబ్ కమిటీ వేస్తాం
  • గ్రేటర్ సమస్యలపై సబ్ కమిటీ
ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలు చెబుతారు తప్ప చేతలుండవని... ఆయనొక నంబర్ 1 పిట్టల దొర అని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నేత షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన ఓ సభలో మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసింది కాంగ్రెస్సేనని స్పష్టం చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌కు సెపరేట్‌ మేనిఫెస్టో సబ్‌కమిటీ వేస్తామని షబ్బీర్ అలీ తెలిపారు. గ్రేటర్‌ సమస్యలపై సబ్‌ కమిటీ చర్చిస్తుందని పేర్కొన్నారు.
Shabbir Ali
KCR
Congress
Hyderabad

More Telugu News