big boss: ‘బిగ్ బాస్’ లో పాల్గొనమని నన్ను వేడుకున్నారు: బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా

  • కోట్లాది రూపాయలిస్తామన్నా నేను అంగీకరించలేదు
  • ‘బిగ్ బాస్’ ఏమైనా స్ఫూర్తిని కలిగించే కార్యక్రమమా?
  • సల్మాన్ దేవుడని.. ‘బిగ్ బాస్’ స్వర్గమని అనుకుంటున్నారా?
బాలీవుడ్ నటుడు నానా పటేకర్ పై నటి తనుశ్రీ దత్తా చేసిన ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. ‘బిగ్ బాస్’లో అవకాశం కోసమే తనుశ్రీ దత్తా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని విమర్శిస్తున్న వారూ లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఆమె స్పందిస్తూ, తనను అవమానపరచడానికి కొందరు అలా మాట్లాడుతున్నారని మండిపడింది.

‘బిగ్ బాస్’ ఏమైనా స్ఫూర్తిని కలిగించే కార్యక్రమమా? సల్మాన్ ఖాన్ దేవుడని, ‘బిగ్ బాస్’ స్వర్గమని అనుకుంటున్నారని ఆమె ప్రశ్నించింది. ‘బిగ్ బాస్’ పదకొండు సీజన్లు జరిగాయని, తనను పాల్గొనమని, కోట్లాది రూపాయలిస్తామని నిర్వాహకులు వేడుకున్నప్పటికీ, తాను అంగీకరించలేదని, రానని చెప్పానని చెప్పుకొచ్చింది.
big boss
tanu sri datta
nanapatekar

More Telugu News