mvvs murthy: ముగిసిన ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలు

షార్ట్స్‌లో చూడండి
టీడీపీ నేత, గీతం విద్యాసంస్థల అధినేత ఎంవీవీఎస్ మూర్తి అంత్యక్రియలు ముగిశాయి. విశాఖలోని గీతం విద్యా సంస్థలకు సమీపంలోని స్మృతి వనంలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. ఎంవీవీఎస్ మూర్తి చితికి ఆయన పెద్ద కుమారుడు రామారావు నిప్పంటించారు.

కాగా, అంతిమ సంస్కారాలలో సీఎం చంద్రబాబునాయుడు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ‘గీతం’ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు, విశాఖలోని టీడీపీ కార్యాలయం నుంచి గీతం యూనివర్శిటీ వరకు అంతిమయాత్ర నిర్వహించారు.
Go Back to Shorts
mvvs murthy
Vizag

More Telugu News