kcr: మోదీ జీతగాడు మనకు సీఎంగా ఉండాలా?: రేవంత్ రెడ్డి

  • వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదు
  • కేసీఆర్ తన ఇష్టానుసారం మాట్లాడటం తగదు
  • మా గెలుపు ఖాయం
ప్రధాని మోదీ జీతగాడు కేసీఆర్ అని, రాబోయే కాలంలో ఇలాంటి జీతగాడు మనకు సీఎంగా కావాలా? అని టీ-కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కుత్బుల్లాపూర్ లో ముస్లిం మైనార్టీల సభను కాంగ్రెస్ పార్టీ నిర్వహించింది. ఈ సభలో పాల్గొన్న రేవంత్ మాట్లాడుతూ, కేసీఆర్ సీఎం అయిన తర్వాత ఆయన కుటుంబం బాగుపడింది తప్ప, ప్రజలకు మేలు జరగలేదని విమర్శించారు.

వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించిన కేసీఆర్ తన ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ప్రజలు ఓడిస్తారని, తమ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కనుక, పోలీసులు ఇక స్వేచ్ఛగా పనిచేసుకోవచ్చని అన్నారు.
 
kcr
modi
Revanth Reddy

More Telugu News