Hyderabad: తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకున్న మూర్తి పార్థివ దేహం.. 8 గంటలకు విశాఖకు..!

  • మూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించనున్న వెంకయ్యనాయుడు, చంద్రబాబు
  • మధ్యాహ్నం 2:15 గంటలకు అంతిమయాత్ర
  • గీతం డీమ్డ్‌ వర్సిటీ సమీపంలో అంత్యక్రియలు
అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ నేత, ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి పార్థివ దేహం ఈ తెల్లవారుజామున హైదరాబాద్ చేరుకుంది. ఉదయం 8 గంటలకు విమానంలో విశాఖపట్టణం తరలిస్తారు. అక్కడి నుంచి సిరిపురంలోని ఆయన ఇంటికి తరలించి మధ్యాహ్నం వరకు అక్కడే ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఇతర నేతలు, ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తారు.

మధ్యాహ్నం 2:15 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుంది. అక్కడి నుంచి రాక్‌డేల్‌ లే అవుట్‌లోని టీడీపీ కార్యాలయంలో మూర్తి పార్థివ దేహాన్ని కాసేపు ఉంచుతారు. అనంతరం  గీతం డీమ్డ్‌ వర్సిటీ సమీపంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
Hyderabad
Andhra Pradesh
MVVS Murhy
Visakhapatnam District
America

More Telugu News