Chandrababu: నకిలీ సర్వేలతో నైతిక స్థైర్యం దెబ్బతీయాలని చూస్తున్నారు!: ఏపీ సీఎం చంద్రబాబు
- ప్రభుత్వం పట్ల ప్రజల్లో పూర్తి సంతృప్తి ఉంది
- పని బాగా చేసుకు పోతే.. ప్రజలే అంతిమతీర్పు ఇస్తారు
- టీడీపీ ఎంపీలతో భేటీలో చంద్రబాబు
ప్రజలు టీడీపీతోనే ఉన్నారని, ప్రజలే మన హైకమాండ్ అని తమ ఎంపీలతో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు భేటీ ముగిసింది. ప్రభుత్వం పట్ల ప్రజల్లో పూర్తి సంతృప్తి ఉందని, పని బాగా చేసుకుంటూ పోతే, ప్రజలే అంతిమతీర్పు ఇస్తారని తమ ఎంపీలతో చంద్రబాబు చెప్పినట్టు సమాచారం. ఏపీలో జరుగుతున్న ఐటీ దాడుల గురించీ చంద్రబాబు ప్రస్తావించారని, పెట్టుబడులు రాకుండా చేసేందుకే కేంద్రం ఐటీ దాడులు చేయిస్తోందని అన్నట్టుగా తెలుస్తోంది. నకిలీ సర్వేలతో నైతిక స్థైర్యం దెబ్బతీయాలని బీజేపీ, వైసీపీ చూస్తున్నాయని, ఈ రెండు పార్టీల కుట్రలు నెరవేరవని చంద్రబాబు అన్నట్లు సమాచారం.
బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు కృషి చేయాలని, జాతీయ స్థాయిలో రెండు సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, సర్కారియా కమిషన్ సిఫార్సులపై తొలి సదస్సు, రైతు సమస్యలపై జాతీయ స్థాయిలో రెండో సదస్సు నిర్వహించాలని, బీజేపీకి వ్యతిరేకంగా శీతాకాల సమావేశాల్లోపు పోరాట కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. టీడీపీ జాతీయ స్థాయిలో జరిపే పోరుకు కొత్త పార్టీలతో పొత్తు తప్ప మరో మార్గం లేదని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.