t-Telugudesam: మరి, ఏ ఆలోచనతో ఈసీ షెడ్యూల్ ప్రకటించింది?: టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ

  • ఓటర్ల జాబితాలో అవకతవకల అంశం కోర్టులో ఉంది
  • హడావుడిగా ఈసీ షెడ్యూల్ ఎందుకు ప్రకటించింది?
  • ఎన్నికలెప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉంది
తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకల అంశం కోర్టు పరిధిలో ఉంటే, మరి, ఏ ఆలోచనతో ఈసీ షెడ్యూల్ ప్రకటించిందని టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ప్రశ్నించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, హడావుడిగా ఈసీ షెడ్యూల్ ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా ముందుకు వెళతామని చెప్పిన రమణ, ఎన్నికలు ఎప్పుడొచ్చినా టీడీపీ సిద్ధంగా ఉందని అన్నారు. ఎన్నికల కమిషన్ తో మాట్లాడానని గతంలో కేసీఆర్ అన్న మాటను ఈ సందర్భంగా రమణ గుర్తుచేశారు. కేసీఆర్ మూఢనమ్మకాలే ఆయనకు ఉరితాడుగా మారబోతున్నాయని విమర్శించారు. 
t-Telugudesam
L.Ramana
elections

More Telugu News