Telangana: తెలంగాణలో ‘కాంగ్రెస్’ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు

  • కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం
  • సమావేశానికి హాజరైన ఉత్తమ్, కుంతియా తదితరులు
  • 119 అసెంబ్లీ స్థానాలకు సీట్ల కేటాయింపుపై చర్చ
తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక నిమిత్తం పార్టీ సీనియర్ నేతలతో సమాలోచనలు జరిగాయి. హైదరాబాద్ లోని గోల్కోండ రిసార్ట్ లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. ఈ కమిటీలో మొత్తం 41 మంది సభ్యులు ఉన్నారు. ఈ సమావేశానికి టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియా, సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, వి.హనుమంతరావు, జానా రెడ్డి, డీకే అరుణ, పొన్నం ప్రభాకర్, రేవంత్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. తెలంగాణలోని 119 అసెంబ్లీ స్థానాలకు సీట్ల కేటాయింపుపై వారు చర్చించారు.
Telangana
Congress
Uttam Kumar Reddy

More Telugu News