Uttam Kumar Reddy: ఉత్తమ్ కుమార్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నాడు: మంత్రి తలసాని

  • కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న చోట మిషన్ కాకతీయ పనులు జరగట్లేదా?
  • ఉత్తమ్ కుమార్ రెడ్డివి బట్టేబాజ్ మాటలు
  • మా సభలతో ‘కాంగ్రెస్’కు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి
టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాలి మాటలు మాట్లాడుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మిషన్ కాకతీయ పనులు జరగడం లేదా? రైతు బంధు చెక్కులు అందడం లేదా? ఆసరా పెన్షన్లు ఇవ్వడం లేదా? అని ప్రశ్నించారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నాడని, కాంగ్రెస్ పార్టీది నీచమైన చరిత్రని దుయ్యబట్టారు. సీఎం కేసీఆర్ సభలను చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయని విమర్శించారు. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం జరుగుతోందని, అన్ని రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేశామని, దళితులకు భూ పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోందని, సబ్బండ వర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు.
Uttam Kumar Reddy
talsani srinivas

More Telugu News