araku: అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఇప్పుడు కాదు.. ఎన్నికల సంఘం స్పష్టీకరణ!

  • ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు ఈ ఉపఎన్నిక ఉండదు
  • ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్
  • ఎమ్మెల్యే కిడారిని ఇటీవల కాల్చి చంపిన మావోయిస్టులు
రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, మిజోరాం, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల షెడ్యూల్ కొద్ది సేపటి క్రితం వెలువడిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్ తో పాటే ఏపీలోని అరకు అసెంబ్లీ నియోజకవర్గానికీ ఉపఎన్నిక జరగొచ్చని భావించారు. కానీ, ఆ నియోజకవర్గానికి ఉపఎన్నిక ఇప్పుడు నిర్వహించట్లేదు. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ కొద్ది సేపటి క్రితం స్పష్టం చేశారు. కాగా, విశాఖపట్టణం జిల్లాలోని లివిటిపుట్టులో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు ఇటీవల కాల్చి చంపారు.
araku
op rawat
by election

More Telugu News