ysr: వైఎస్ రాజశేఖరరెడ్డి విలువ తీయకు.. నెటిజన్ కు పూనమ్ కౌర్ క్లాస్!

  • ఓటుకు నోటుపై స్పందించిన నటి
  • ఆ ట్వీట్ ను విమర్శించిన నెటిజన్
  • దీటుగా జవాబిచ్చిన పూనమ్ కౌర్
ప్రముఖ హీరోయిన్ పూనమ్ కౌర్, ఓ నెటిజన్ కు మధ్య ట్విట్టర్ లో వార్ నడిచింది. తొలుత ఓటుకు నోటు కేసుపై పూనమ్ స్పందించింది. ‘ఆంధ్రా.. తెలంగాణ అంటూ మన వాళ్లే కొట్టుకుంటూ ఉంటే లాభం ఎవరికబ్బా? నాకు అయితే ఏమీ అర్థం కావడం లేదు. వీళ్లను చూస్తుంటే పిల్లి-పిల్లి తగువును కోతి తీర్చిన కథ గుర్తుకు వస్తోంది’ అంటూ ట్వీట్ చేసింది.

దీంతో ఆనంద్ రెడ్డి కోలా అనే నెటిజన్ స్పందిస్తూ.. ‘ఓటుకు నోటు వల్ల లాభం ఎవరికి? అసలు ఎంతమాత్రం ఆలోచించకుండా చేసిన రాజకీయ ట్వీట్ ఇది. మీరు ఎంత మాట్లాడినా మీవల్ల టీడీపీకి ఒక్క ఓటు కూడా రాదు’ అని ట్వీట్ చేశాడు. అతను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటోను ప్రొఫైల్ పిక్ గా పెట్టుకున్నాడు. దీంతో సదరు నెటిజన్ విమర్శపై పూనమ్ కౌర్ దీటుగా స్పందించింది.

‘నువ్వు ఎవరి ఫొటో పెట్టుకున్నావో.. ఆ పెద్దమనిషి విలువ తీయకు. ఇలాంటి అసభ్యకరమైన భాషను సోషల్ మీడియాలో వాడుతున్నావా? ఇదేమన్నా సినిమానా పంచులు వేయడానికి. ఎన్నో కుటుంబాలు, ప్రజలు మీకోసం చూస్తున్నప్పుడు వాడే భాష ఇదేనా? నీ వ్యాఖ్యలు రోత పుట్టిస్తున్నాయ్’ అని క్లాస్ పీకింది. దీంతో సదరు నెటిజన్ తోకముడిచాడు. కాగా ఈ వ్యవహారంలో కొందరు పూనమ్ కు మద్దతు తెలుపుతుండగా, మరికొందరు సదరు నెటిజన్ కు అండగా ట్వీట్లు చేస్తున్నారు.
ysr
poonam kaur
vote for note
Twitter
comment
Andhra Pradesh
Telangana
fight

More Telugu News