Prakash Raj: అదో చిన్న ఘటన... ఇంత రాద్ధాంతమెందుకు?: అనుపమా పరమేశ్వరన్

  • అనుపమను ప్రకాశ్ రాజ్ తిట్టాడని వార్తలు
  • ఏడుస్తూ కళ్లు తిరిగి పడిపోయిందని ప్రచారం
  • చాలా చిన్న విషయమని తీసిపారేసిన హీరోయిన్
ఓ సినిమా షూటింగ్ లో భాగంగా హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ను నటుడు ప్రకాశ్ రాజ్ తిట్టాడని, దీంతో ఏడుపు లంఘించుకున్న ఆమె, కళ్లు తిరిగి కిందపడిపోగా, ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చిందని జరుగుతున్న ప్రచారంపై అనుపమా పరమేశ్వరన్ స్పందించింది. తామిద్దరమూ ఆరు నెలల పాటు కలసి పని చేశామని, తమ మధ్య జరిగిన చాలా చిన్న ఘటనను చిలువలు పలువలుగా చేసి ప్రచారం చేశారని వాపోయింది.

ప్రకాష్ రాజ్ తనకో చిన్న సలహాను ఇచ్చారని, అది ఆయన్నుంచి తనకు చేరేసరికి పుకారుగా మారిందని చెప్పింది. ఈ ఘటన జరిగిన తరువాత కూడా తాము 25 రోజులు కలసే షూటింగ్ చేశామని, తమ మధ్య సత్సంబంధాలే ఉన్నాయని వెల్లడించింది. ప్రకాష్ రాజ్ తో కలసి పని చేయడం తనకు ఆనందాన్ని ఇస్తుందని, చిన్న చిన్న విషయాలకు సొంత కథనాలు జోడించి చెబితే, సినీ జనాలకు ఆసక్తి ఉంటుందని, అందుకే ప్రచారం కోసం చిన్న ఘటనను, తనను వాడుకున్నారని చెప్పుకొచ్చింది.
Prakash Raj
Anupama Parameshwaran
Shooting
Tollywood

More Telugu News