gvl: పన్నులు ఎగ్గొట్టిన రాష్ట్రాల్లో మొదటిది ఏపీ, రెండోది తెలంగాణ: జీవీఎల్

  • పక్కా సమాచారంతోనే ఐటీ శాఖ దాడులు చేస్తోంది
  • చంద్రబాబు భుజాలు తడుముకుంటున్నారు
  • టీడీపీ నేతలూ భయపడుతున్నారు
పన్నులు ఎగ్గొట్టిన రాష్ట్రాల్లో మొదటిది ఏపీ, రెండోది తెలంగాణ అని, అందుకే, ఆయా రాష్ట్రాల్లో ఐటీ శాఖ దాడులు జరుగుతున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, పక్కా సమాచారంతోనే ఏపీలో ఐటీ శాఖ ఈ దాడులు చేస్తోందని అన్నారు.

 ఈ దాడుల నేపథ్యంలో చంద్రబాబు భుజాలు తడుముకుంటున్నారని, టీడీపీ నేతలూ భయపడుతున్నారని అన్నారు. అప్పుల పేరిట కుంభకోణాలు చేసిన ఘనత చంద్రబాబుదేనని, ఆయన తప్పించుకోలేరని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు రూ.500 కోట్లు ఫండ్ గా ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయని అన్నారు.
gvl
Chandrababu
Telugudesam
bjp

More Telugu News