kcr: నేను చెప్పిన మాటల్లో వాస్తవం లేకుంటే టీఆర్ఎస్ ను ఓడించండి: కేసీఆర్

షార్ట్స్‌లో చూడండి
తాను చెప్పిన మాటల్లో వాస్తవం లేకుంటే టీఆర్ఎస్ ను ఓడించాలని, నిజముంటే.. పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను గెలిపించాలని సీఎం కేసీఆర్ కోరారు. వనపర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాదసభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ కోసం పందొమ్మిదేళ్లుగా పోరాడుతున్నానని, ప్రతి ఒక్కరిలో చైతన్యం రావాలని.. ప్రతి ఒక్కరూ కేసీఆర్ కావాలని కోరారు.

ఆరునూరైనా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. 'ఇరవై లక్షల ఎకరాలకు నీళ్లిస్తేనే మళ్లీ పాలమూరులో ఓట్లు అడుగుతా లేకపోతే అడగను' అని అన్నారు. పాలమూరును సస్య శ్యామలం చేస్తానని, వేరే జిల్లాల నుంచి ఇక్కడికి కూలీ కోసం వచ్చే పాలమూరును బహుమతిగా ఇస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. 
Go Back to Shorts
kcr
TRS

More Telugu News