Wanaparthy District: అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుపడుతోంది: టీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డి

  • తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఓ కీలకమైన స్థానంలో ఉంది
  • కేసీఆర్ పరిపాలనలో వేగంగా అభివృద్ధి జరుగుతోంది
  • వనపర్తి  ప్రజా ఆశీర్వాద సభలో సురేష్ రెడ్డి
నాలుగున్నర సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో వేగంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయని టీఆర్ఎస్ నేత సురేష్ రెడ్డి అన్నారు. వనపర్తిలో ప్రజా ఆశీర్వాద సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా సురేష్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఓ కీలకమైన స్థానంలో ఈరోజు ఉందని అన్నారు.

నాడు తాను స్పీకర్ గా ఉన్న సమయంలో, పాలమూరు గురించి చర్చ వచ్చినప్పుడు తన హృదయం కలచివేసేదని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అడ్డుపడుతోందని విమర్శించారు. కాగా, సభాస్థలికి చేరుకున్న సీఎం కేసీఆర్ కు టీఆర్ఎస్ నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం, తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ పూల మాల వేశారు. వేదపండితులు ఆయన్ని ఆశీర్వదించారు.
Wanaparthy District
TRS
suresh reddy

More Telugu News