sm krishna: రాజకీయాల నుంచి తప్పుకుంటున్న కర్ణాటక మాజీ సీఎం

  • కర్ణాటక ఎన్నికల ముందు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరిన ఎస్ఎం కృష్ణ
  • బీజేపీలో తగినంత ప్రాధాన్యత లేకపోవడంతో అసంతృప్తి
  • రాజకీయ సన్యాసం తీసుకోవాలని నిర్ణయం
కర్ణాటక మాజీ ముఖమంత్రి ఎస్ఎం కృష్ణ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్ పార్టీ తనను పక్కన పెట్టేయడంలో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు ఆయన బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. అయితే, బీజేపీ కూడా తగినంత ప్రాధాన్యతను ఇవ్వకపోవడంతో ఇక రాజకీయ సన్యాసం తీసుకోవాలని ఆయన నిర్ణయించుకున్నట్టు సమాచారం.

త్వరలోనే ఆయన ఆటోబయోగ్రఫీ పుస్తకం విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగే సభలో రాజకీయాల నుంచి తప్పుకునే విషయాన్ని ప్రకటించనున్నట్టు సమాచారం. ఒకవేళ ఎస్ఎం కృష్ణ రాజకీయాలకు దూరమైతే ఆయన రెండో కుమార్తె శాంభవిని తెరపైకి తీసుకురావాలనే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలుస్తోంది. మండ్య లోక్ సభ నియోజకవర్గం నుంచి ఆమెను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోంది.
sm krishna
karnata
bjp

More Telugu News