Amaravati: సదరన్ డెవలపర్స్ కార్యాలయంలో ఓ మంత్రి భూ దందా డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు!

  • అమరావతి ప్రాంతంలో భూ లావాదేవీలు
  • ముందు నుంచే నిఘా పెట్టిన అధికారులు
  • సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం
ఈ ఉదయం నుంచి ఆదాయపు పన్ను శాఖ అధికారులు విజయవాడ పరిధిలోని సదరన్ డెవలపర్స్ కార్యాలయాల్లో నిర్వహిస్తున్న సోదాల్లో భాగంగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల్లోని కార్యాలయాల్లో రైడ్స్ జరుగుతూ ఉండగా, సదరన్ కార్యాలయం నుంచి ఏపీ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న ఓ మంత్రికి సంబంధించిన లావాదేవీల డాక్యుమెంట్లను అధికారులు కనిపెట్టి, వాటిని తమ అధీనంలోకి తీసుకున్నారని సమాచారం. సదరు మంత్రి ఇటీవలి కాలంలో పలు ప్రాంతాల్లో భూముల లావాదేవీలను జరుపగా, వాటన్నింటిపైనా ముందునుంచే నిఘా పెట్టిన ఐటీ అధికారులు, ఈ సోదాల్లో వాటిని గుర్తించారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై ఐటీ అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సివుంది.
Amaravati
Vijayawada
Southern Developers
IT Raids

More Telugu News