kcr: దొంగ పాస్ పోర్టు కేసులో కేసీఆర్, హరీష్ రావులపై కేసులు నమోదైంది నిజం కాదా?: రేవూర్ ప్రకాశ్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
మహాకూటమి ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు వణుకు మొదలైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పునాదులు కదలిపోతున్నాయని చెప్పారు. కేసీఆర్ మానసిక ఒత్తిడికి గురవుతున్నారని... అందుకే రాజకీయంగా దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబును ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని చెప్పారు.

కేసీఆర్ ప్రసంగం బ్రిటీష్ వారి విభజించు- పాలించు తరహాలో ఉందని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టి, రాజకీయ పబ్బం గడుపుకోవాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని చెప్పారు. దొంగ పాస్ పోర్టు కేసులో కేసీఆర్, హరీష్ రావులపై కేసులు నమోదైన సంగతి నిజం కాదా? అని ప్రశ్నించారు. కమిషన్లకు కక్కుర్తి పడి ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచి పెడుతున్నారని మండిపడ్డారు.
Go Back to Shorts
kcr
Harish Rao
revuri prakash rao

More Telugu News