nithya menon: లావుగా అయ్యానని విమర్శించారు .. ఆ లావు వల్లనే గొప్ప అవకాశం వచ్చింది: నిత్యామీనన్

  • లావు గురించిన కామెంట్స్ పట్టించుకోను 
  • పాత్ర కోసం సన్నబడగలను
  • 'జయలలిత' బయోపిక్ పై నమ్మకం వుంది     
అందం .. అంతకు మించిన అభినయం నిత్యామీనన్ సొంతం. కథలో విషయం వుంటే తప్ప ఆమె ఏ సినిమాకి ఓకే చెప్పదు. అందువల్లనే ఆమె సినిమాల సంఖ్య తక్కువగా కనిపించినా, వచ్చిన క్రేజ్ ఎక్కువ. వివిధ భాషల్లో ఆమె చేసిన ఆణిముత్యాల్లాంటి పాత్రలు ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టాయి. అలాంటి నిత్యామీనన్ కి ఇటీవల అవకాశాలు బాగా తగ్గిపోయాయి. ఆమె బాగా లావుగా తయారు కావడమే అందుకు కారణమనే కామెంట్స్ వినిపించాయి.

అయితే ఈ మాటలను నిత్యామీనన్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అవసరమైతే పాత్ర కోసం సన్నబడగలను అనే ఆమె చెబుతున్నారు. 'నేను లావు కావడం వలన అవకాశాలు రావడం లేదని అంటున్నారు .. ఇలా లావుగా ఉండటం వల్లనే కదా 'జయలలిత'గారి పాత్రను పోషించే గొప్ప అవకాశం దక్కింది' అంటూ నవ్వేశారు. లావు విషయం అలా ఉంచితే ఈ సినిమా నా కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలిచిపోతుందనే బలమైన నమ్మకం మాత్రం వుంది' అని చెప్పుకొచ్చారు. 
nithya menon

More Telugu News