ntr: 'అరవింద సమేత 'లో అయిదో పాట లేనట్టే!

  • 'అరవింద'లో రెండు హుషారైన డ్యూయెట్స్ 
  • తమన్ ట్యూన్ చేసిన ఫాస్ట్ బీట్ 
  • సమయం లేక వదిలేసిన త్రివిక్రమ్
త్రివిక్రమ్ దర్శకుడిగా వ్యవహరించిన 'అరవింద సమేత వీర రాఘవ' సినిమాకి తమన్ బాణీలను అందించాడు. ఈ సినిమాలో మొత్తం నాలుగు పాటలు వున్నాయి. అయితే ఎన్టీఆర్ డాన్స్ తో దుమ్మురేపేసే పాటలు రెండు మాత్రమే వున్నాయి. అందువలన ఎన్టీఆర్ అభిమానుల కోసం జోరైన .. హుషారైన మరో పాట వుంటే బాగుంటుందని అంతా అనుకున్నారు.

విడుదల తేదీ దగ్గర పడుతుండటం వలన .. సమయం లేకపోవడం వలన తమన్ ట్యూన్ చేసిన ఒక ఫాస్ట్ బీట్ ను త్రివిక్రమ్ పక్కన పెట్టేశాడు. అభిమానుల నుంచి వచ్చిన రిక్వెస్ట్ ల మేరకు ఆయన ఐదో పాటను కూడా చిత్రీకరించినట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ప్రచారంలో నిజం లేదనేది తాజా సమాచారం. ఐదవ పాటను హడావిడిగా చుట్టేయడం ఇష్టంలేక పోవడం వలన, త్రివిక్రమ్ దానిని పక్కన పెట్టేశాడట. కనుక నాలుగు పాటలతోనే ఈ సినిమా ఈ నెల 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోందన్న మాట.    
ntr
pooja

More Telugu News