Jabalpur: విడాకులు తీసుకున్న భార్యను రేప్ చేసిన మాజీ భర్త... పదేళ్ల జైలు!

  • 2015లో వివాహం చేసుకున్న జంట
  • ఆపై మనస్పర్థలతో 2016లో విడాకులు
  • కేసును విచారించి తీర్పిచ్చిన జబల్ పూర్ కోర్టు
విడాకులు తీసుకున్న తన మాజీ భార్య ఇంటికెళ్లి, ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఘటనలో ఓ వ్యక్తికి పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించింది జబల్ పూర్ జిల్లా అదనపు సెషన్స్ కోర్టు. మరిన్ని వివరాల్లోకి వెళితే, నగరానికి చెందిన ఓ వ్యక్తికి, బాధితురాలికి 2015 ఏప్రిల్ 17న వివాహం జరిగింది. ఆ వెంటనే వారి మధ్య విభేదాలు తలెత్తడంతో, 2016 డిసెంబర్ లో వారు విడాకులు పొందారు.

గత సంవత్సరం జూలై 25న తన మాజీ భార్య ఇంటికి వచ్చిన అతను, ఆమెపై అత్యాచారం చేశాడు. విడాకులు ఇచ్చిన తరువాత, తన మాజీ భర్త రేప్ చేశాడంటూ, ఆమె పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదైంది. ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయమూర్తి ఆర్పీ సోనీ, నిందితుడికి పదేళ్ల జైలు శిక్షను విధిస్తున్నానని, రూ. 5 వేల జరిమానాను ఆమెకు చెల్లించాలని తీర్పిచ్చారు.
Jabalpur
Court
Rape
Divorce
Ex Husbend

More Telugu News