Andhra Pradesh: అరగంట ముందు మాత్రమే చెబుతాం... మాతో రావాలి!: ఏపీ పోలీసులకు ఐటీ శాఖ ప్రత్యేక ఆదేశాలు!

షార్ట్స్‌లో చూడండి
కేంద్ర ఐటీ శాఖ నేతృత్వంలో ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి అమరావతి ప్రాంతానికి చేరుకున్న అధికారుల బృందాలు, పలువురు రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులపై దాడులు ప్రారంభించారు. అధికారులు విజయవాడకు చేరుకోక మునుపే పోలీసు ఉన్నతాధికారులకు కేంద్ర హోమ్ శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఐటీ అధికారుల సోదాలకు అవసరమైన సహకారాన్ని అందించాలని, ఈ విషయం ఉన్నతాధికారుల మధ్య మాత్రమే ఉండాలని ఆదేశాలు అందాయి.

 ఇక ఈ సోదాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా సాగేందుకు పోలీసు శాఖ సహకారాన్ని అందించాలని, తాము ఎక్కడికి దాడులకు వెళుతున్నామో ముందుగా చెప్పబోమని, కేవలం అరగంట ముందు మాత్రమే చెబుతామని, వెంటనే తమతో వచ్చి భద్రత కల్పించాల్సి వుంటుందని ఐటీ అధికారులు కోరినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Andhra Pradesh
IT
Raids
Police

More Telugu News