తెలంగాణలో తగ్గనున్న టీఆర్ఎస్ బలం... పుంజుకోనున్న కాంగ్రెస్!

షార్ట్స్‌లో చూడండి
రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ బలం తగ్గనుందని సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. రాష్ట్రంలోని 17 లోక్ సభ స్థానాలకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, టీఆర్ఎస్ కు 9 స్థానాలే దక్కుతాయని, కాంగ్రెస్ బలం 6కు పెరుగుతుందని, ఎంఐఎం, బీజేపీలకు చెరో స్థానం దక్కుతాయని అంచనా వేసింది.

 2014 ఎన్నికలతో పోలిస్తే టీఆర్ఎస్ బలం 11 ఎంపీ సీట్ల నుంచి 2 స్థానాలు తగ్గుతాయని తెలిపింది. బీజేపీ తనకున్న ఒక్క సీటునూ నిలుపుకుంటుందని, టీడీపీ తాను పొందిన ఒక్క స్థానాన్నీ కోల్పోతుందని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ 2014లో 2 సీట్లను మాత్రమే గెలిచినప్పటికీ, ఈ దఫా మహాకూటమి కారణంగా లాభపడి 6 సీట్ల వరకూ గెలుస్తుందని అంచనా వేసింది.
Go Back to Shorts
Telangana
Elections
C-Voter

More Telugu News