kcr: రేపటి నుంచి రైతుబంధు చెక్కుల పంపిణీ: సీఎం కేసీఆర్

  • చెక్కుల పంపిణీ వద్దని ఓ పుణ్యాత్ముడు కోర్టు కెళ్లాడు
  • కోర్టు రెండు చెంపలు వాయించింది
  • రైతు బంధు చెక్కుల పంపిణీ చేయమని ఆదేశించింది
తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని, రైతుబంధు చెక్కుల పంపిణీ చేయొద్దంటూ కోర్టుకు వెళ్లిన కాంగ్రెస్ నేత మర్రి శశిధర్ రెడ్డికి మొట్టికాయలు పడ్డాయని సీఎం కేసీఆర్ విమర్శించారు. నల్గొండ సభలో ఆయన మాట్లాడుతూ, ‘రైతు బంధు చెక్కులివ్వొద్దని మర్రి శశిధర్ రెడ్డి అని ఒక పుణ్యాత్ముడు కోర్టుకు పోయాడు. కోర్టు రెండు చెంపలు వాయించింది’ అని అన్నారు. రైతు బంధు చెక్కులను పంపిణీ చేయమని హైకోర్టు ఆదేశించిందని, రేపటి నుంచి గ్రామాల్లో చెక్కుల పంపిణీ ప్రారంభమవుతుందని కేసీఆర్ పేర్కొన్నారు.
kcr
marri shashidhar reddy
rythu bandhu

More Telugu News