andhra jyothy: ‘ఆంధ్రజ్యోతి’ని ‘అబద్ధాల జ్యోతి’గా మార్చిన రాధాకృష్ణ: కన్నా లక్ష్మీనారాయణ

  • బీజేపీ-వైసీపీకి పొత్తు కుదిరిందనడాన్ని ఖండిస్తున్నా  
  • ఆధారాలు లేకుండా అసత్యాలతో నిండి వుంది
  •  పగటి కలలు కంటూ రాసినట్టుంది
బీజేపీ-వైసీపీకి పొత్తు కుదిరిందంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రచురితమైన వార్తా కథనాన్ని ఖండిస్తున్నానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో కన్నా ఓ పోస్ట్ చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ని  ‘అబద్ధాల జ్యోతి’గా మార్చిన రాధాకృష్ణ.. అన్న శీర్షికతో కన్నా ఈ పోస్టును రాశారు. ఆధారాలు లేకుండా అసత్యాలతో, ఊహాగానాలతో నిండి ఉన్న ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఈ కథనం మొత్తంగా పగటి కలలు కంటూ రాసినట్టు అనిపిస్తోందని విమర్శించారు. పత్రికారంగంలో ఎంతో అనుభవమున్న మీ నుంచి ఇది ఊహించలేదని ఆంధ్రజ్యోతి, మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను ఉద్దేశించి కన్నాఈ వ్యాఖ్యలు చేశారు. 
andhra jyothy
kanna laxmi narayana

More Telugu News