kcr: కేసీఆర్ తెలంగాణ ద్రోహి.. నా గురించి మాట్లాడే అర్హత కూడా లేదు: జైపాల్ రెడ్డి

షార్ట్స్‌లో చూడండి
నిన్న ఇందూరు సభలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనపై చేసిన విమర్శలపై కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ తెలంగాణ ద్రోహి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన గురించి మాట్లాడే నైతిక అర్హత కూడా కేసీఆర్ కు లేదని అన్నారు.

తెలంగాణను వ్యతరేకించిన వారందరినీ మంత్రివర్గంలోకి తీసుకున్నారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని... ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో కేసీఆర్ జతకడతారని అన్నారు.

గద్వాల జోగులాంబ జిల్లాలోని ఆలంపూర్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కాంగ్రెస్ నేతలు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
Go Back to Shorts
kcr
jaipal reddy
telangana
TRS
congress

More Telugu News