కౌశల్ ఆర్మీ అనేది ఆ సంఘటన నుంచి మొదలైందట: కౌశల్ తండ్రి సుందరయ్య
- కౌశల్ కంట్లో కిరీటీ నిమ్మరసం పిండబోయాడు
- అది చూసి చాలా మంది బాధపడ్డారు
- అప్పటి నుంచి కౌశల్ కి సపోర్ట్ చేశారు
కౌశల్ టైటిల్ ను సాధించాక బెంగుళూర్ కి చెందిన ఒక 500 మంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు బేగంపేటలో ఒక మీటింగ్ పెట్టుకుని, కౌశల్ ను ఆహ్వానించి అభినందించారు. అప్పుడు వాళ్లు కౌశల్ ఆర్మీ ఎలా మొదలైందనేది చెప్పారు. కిరీటి ఎప్పుడైతే నిమ్మరసం కౌశల్ కంట్లో పిండటానికి ప్రయత్నించాడో అప్పుడే మాలో ఒక రకమైన కసి పెరిగింది. కౌశల్ ఏం తప్పు చేశాడని అలా చేస్తున్నారు? ఆటను ఆటలా ఆడకుండా ఎందుకు కౌశల్ ని బాధపెడుతున్నారు? అనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో కౌశల్ ను సపోర్ట్ చేయాలని మేమంతా నిర్ణయించుకున్నాము .. ఆ నిర్ణయంలో నుంచే కౌశల్ ఆర్మీ పుట్టింది అని వాళ్లు ఓపెన్ గా చెప్పారు" సుందరయ్య.