pranay: కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోండి: పోలీసులకు అమృత ఫిర్యాదు

  • సోషల్ మీడియాలో దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు
  • అసత్య ప్రచారాలను ఆపాలని కోరినా... మార్పు లేదు
  • చట్టపరమైన చర్యలు తీసుకోండి
తన భర్త ప్రణయ్ హత్య తర్వాత సోషల్ మీడియాలో కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అమృత కోరింది. ఈ మేరకు మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిన్న సాయంత్రం ప్రణయ్ కుటుంబసభ్యులతో కలసి ఆమె సీఐని సంప్రదించింది.

తమను కించపరిచే విధంగా ప్రతి రోజు సోషల్ మీడియాలో పోస్టింగులు వస్తున్నాయని... అలాంటి అసత్య ప్రచారాలను ఆపాలని తాను ప్రాధేయపడినా, ఎలాంటి మార్పు లేదని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా సీఐ నాగరాజు స్పందిస్తూ, పూర్తి వివరాలతో ఫిర్యాదు చేస్తే, పరిశీలించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
pranay
amrutha
murder
social media
police

More Telugu News