jagan: కన్నా-జగన్- పవన్ ల మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోంది!: మంత్రి సోమిరెడ్డి

  • పవన్ మోదీ చంకనెక్కినా మాకు అభ్యంతరం లేదు
  • రైతులపై దాడికి కేంద్రం క్షమాపణ చెప్పాలి
  • రాఫెల్, పెట్రోల్ వాతపై పవన్ మౌనంగా ఎందుకున్నారు
ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ అధినేత జగన్‌, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ లు ప్రేమించుకుంటున్నారని టీడీపీ నేత, మంత్రి సోమిరెడ్డి తెలిపారు. పవన్ మోదీ చంకలో కూర్చుని ముద్దులు పెట్టుకున్నా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని వెల్లడించారు. కేంద్రంపై పోరాడతానని ప్రకటించిన పవన్ కల్యాణ్.. రాఫెల్ కుంభకోణం, పెట్రోల్ ధరలపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో ఎన్ని ఇన్వెస్టిగేషన్లు, ఇంటరాగేషన్లు చేసినా తమను ఎవ్వరూ ఏమీ చేయలేరని సోమిరెడ్డి అన్నారు.

ఢిల్లీలో రైతన్నలపై పోలీసుల చేత లాఠీచార్జీ చేయించడంపై కేంద్రం వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. బీజేపీ ఎమర్జెన్సీని మించి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ నేత డీకే శివకుమార్, తెలంగాణలో జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి.. ఇలా తమ వ్యతిరేకులు, ప్రతిపక్ష నేతలను బీజేపీ లక్ష్యంగా చేసుకుంటోందని ఆరోపించారు.
jagan
Pawan Kalyan
kanna lakshmi narayana
Andhra Pradesh
somireddy chandramohan reddy
love story

More Telugu News