Chandrababu: నేను ప్రధాని అవుతాననే వ్యాఖ్యలు చేయవద్దు: చంద్రబాబు

  • అలాంటి ప్రచారం వల్ల నష్టమే తప్ప లాభం లేదు
  • జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకం చేస్తున్నాం
  • ఆ ప్రయత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది
తాను ప్రధాని అవుతాననే వ్యాఖ్యలు చేయవద్దని మంత్రులు, టీడీపీ నేతలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కొందరు నేతలు ఇటీవల ఇలాంటి వ్యాఖ్యలు చేశారని... వీటి వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని చెప్పారు. ఇలాంటి ప్రచారాల వల్ల జాతీయ రాజకీయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పారు. టీడీపీ సమన్వయకమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మేరకు సూచించారు. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలను ఏకం చేసేందుకు ప్రస్తుతం ప్రయత్నాలు జరుగుతున్నాయని... తాను ప్రధాని అవుతాననే ప్రచారం ఈ ప్రయత్నాలకు విఘాతం కలిగిస్తుందని చెప్పారు. 
Chandrababu
Prime Minister

More Telugu News