USA: అమెరికాలో ఉన్మాది ఘాతుకం.. పోలీస్ అధికారిని బలితీసుకున్న దుండగుడు!

షార్ట్స్‌లో చూడండి
అమెరికాలోని దక్షిణ కరోలినా కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఓ దుండగుడు పోలీసులే లక్ష్యంగా ఇష్టానుసారం కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఐదుగురు పోలీస్ అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, ఓ అధికారి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఫ్లోరెన్స్ కౌంటీ పరిధిలోని మిర్టల్ తీరంలో చోటుచేసుకున్న ఘటనతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు.

స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఓ ఇంట్లోకి ప్రవేశించిన దుండగుడు చిన్నారులను బందీలుగా చేసుకున్నాడు. దీంతో ఘటనాస్థలానికి పోలీసులు వెంటనే చేరుకున్నారు. అధికారులను గమనించిన నిందితుడు ఇష్టానుసారం కాల్పులు జరపడం ప్రారంభించాడు. ఈ ఘటనలో ఐదుగురు అధికారులు తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

చివరికి రెండు గంటల పాటు ఆపరేషన్ నిర్వహించి నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకోగలిగారు. అయితే ఈ దాడికి గల కారణం ఇంకా తెలియరాలేదు. మరోవైపు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అధికారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాళులు అర్పించారు. పోలీస్ అధికారులకు అమెరికా ప్రజలు జీవితాంతం రుణపడి ఉంటారని వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
USA
shootout
south carolina
florance
police
hostage

More Telugu News