NTR: ఎన్టీఆర్ బయోపిక్ టైటిల్.. 'ఎన్టీఆర్ కథానాయకుడు'!

  • వెల్లడించిన దర్శకుడు క్రిష్
  • ఓ పోస్టర్ కూడా విడుదల
  • జనవరి 9న విడుదల  
తన తండ్రి పాత్రలో బాలకృష్ణ నటిస్తుండగా, క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం టైటిల్ ను ఈ ఉదయం అనౌన్స్ చేశారు. ఈ సినిమాకు 'ఎన్టీఆర్ కథానాయకుడు' అని పేరు పెట్టినట్టు జాగర్లమూడి క్రిష్, తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.

"ప్రతి కథకీ ఓ నాయకుడుంటాడు.. కానీ కథగా మారే నాయకుడొక్కడే వుంటాడు" అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించాడు. ఎన్టీఆర్ జానపద చిత్రాలు చేస్తున్న వేళ, ఎలా ఉంటాడో చూపుతూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. జనవరి 9న చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. నేడు విడుదల చేసిన ఎన్టీఆర్ బయోపిక్ టైటిల్ పోస్టర్ ను మీరూ చూడండి.
NTR
Biopic
NTR Kadhanayakudu
Balakrishna
Krish

More Telugu News