NTR: ‘ఎన్టీఆర్’ నుంచి నేటి ఉదయం 9:35 గంటలకు సర్‌ప్రైజ్.. వేచి చూడాలన్న చిత్ర యూనిట్!

షార్ట్స్‌లో చూడండి
‘ఎన్టీఆర్’ బయోపిక్ నుంచి నేడు (గురువారం) మరో సర్‌ప్రైజ్ రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ ఉదయం 9:35 గంటలకు ఆ సర్‌ప్రైజ్‌ను బయటపెట్టనున్నట్టు తెలిపింది. అది చాలా పెద్ద వార్తేనని, తెలుసుకునేందుకు వేచి చూడాలని కోరింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది.

రోజుకో వార్తతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతుండగా, తాజా వార్త అందరిలోనూ ఉత్కంఠ రేపింది. ఎన్టీఆర్ తనయుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా బాలకృష్ణ, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్, చంద్రబాబునాయుడుగా రానా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తోంది.
Go Back to Shorts
NTR
Balakrishna
Tollywood
Biopic
Akkineni Sumanth
Rana

More Telugu News