kcr: నా నోరు కూడా చాలా చెడ్డ నోరే.. తెరిచినాననుకో తెల్లారే దాకా తిడతా!: ఉత్తమ్ కు కేసీఆర్ కౌంటర్

  • ఎవడు బట్టే బాజ్?
  • ఎవరి ప్రవర్తన ఏంటో, మీ కళ్ల ముందుంది?
  • ప్రజలు తమ ఓటు ద్వారా చెప్పాలి
తనను తీవ్ర వ్యాఖ్యలతో దూషించిన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. నిజామాబాద్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మాట్లాడుతూ, ‘‘ముఖ్యమంత్రి బట్టే బాజ్ గాడు’ అన్నాడు.. అనొచ్చునా? ఎవడు బట్టే బాజ్? ఆ జవాబు మీరు (ప్రజలు) ఓటు ద్వారా చెప్పాలి. ఎవరి ప్రవర్తన ఏంటో, మీ కళ్ల ముందుంది. ఆగం కావద్దు. నా నోరు కూడా చాలా చెడ్డ నోరే..తెరిచినాననుకో తెల్లారే దాకా తిడతా. కానీ, నేను ముఖ్యమంత్రిని కదా, గౌరవప్రదమైన హోదాలో ఉన్నాను కాబట్టే నోరుగట్టుకున్నా’ అని అన్నారు.
kcr
Uttam Kumar Reddy

More Telugu News