Chandrababu: లంచాలు రావని ‘భోగాపురం’ టెండర్లను చంద్రబాబు రద్దు చేయించారు: వైఎస్ జగన్

షార్ట్స్‌లో చూడండి
భోగాపురం ఎయిర్ పోర్టుకు టెండర్లు పిలిచారని, అయితే, లంచాలు రావని చెప్పే వాటిని చంద్రబాబు రద్దు చేయించారని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల జంక్షన్ వద్ద బహిరంగసభ నిర్వహించారు.

ఈ సభలో జగన్ మాట్లాడుతూ, భోగాపురం ఎయిర్ పోర్టు నిమిత్తం రైతుల నుంచి భూములు లాక్కున్నారని, బడా బాబుల భూములను మాత్రం ప్రభుత్వం ముట్టుకోలేదని ఆరోపించారు. రైతు రుణమాఫీ చేయలేదని, నాలుగున్నరేళ్లలో ఒక్క ఉద్యోగాన్ని కూడా చంద్రబాబు భర్తీ చేయలేదని, మధ్యాహ్న భోజన పథకాన్ని చంద్రబాబు నీరుగార్చారని, నాసిరకం బియ్యం, కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేస్తున్నారని, ఫీజు రీయింబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలను సైతం చంద్రబాబు నీరుగార్చారని మండిపడ్డారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడ చూసినా అవినీతేనని ఆరోపించారు.
Go Back to Shorts
Chandrababu
bhogapuram

More Telugu News