Telangana: తెలంగాణ సీఎస్ ను కలిసి ఫిర్యాదు చేసిన టీడీపీ నేత రావుల

  • బస్సులపై ప్రభుత్వ పథకాల ప్రకటనలు కన్పిస్తున్నాయి
  • అభ్యర్థులు ఎస్కార్ట్ వాహనాలు వినియోగించకూడదు
  • ఎన్నికలు పారదర్శకంగా జరిపించాలని కోరాం: రావుల
తెలంగాణ సీఎస్ ఎస్ కే జోషిని టీ-టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు కలిశారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ అసెంబ్లీ రద్దయినప్పటి నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని, అయినప్పటికీ, ప్రభుత్వ వాహనాలు, బస్సులపై ప్రభుత్వ పథకాల ప్రకటనలు కనిపిస్తున్నాయని ఫిర్యాదు చేశామని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎస్కార్ట్ వాహనాలు వినియోగించకూడదన్న విషయాన్ని ఆయన దృష్టికి తెచ్చామని, ఎన్నికలు పారదర్శకంగా జరిపించాలని కోరామని చెప్పారు. 
Telangana
tTelugudesam
ravula

More Telugu News