రాజీనామా వార్తలు పుకార్లే: కాంగ్రెస్ నేత, సినీ నటి రమ్య
- కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చీఫ్ పదవికి రాజీనామా చేసినట్టు వార్తలు
- ఆ వార్తల్లో నిజం లేదన్న దివ్యస్పందన
- గురువారం నాడు ఆఫీసుకు వస్తానంటూ సమాధానం
రాఫెల్ ఒప్పందం నేపథ్యంలో... మోదీ ఒక దొంగ అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఓ ఫొటోను కూడా దానికి జతచేశారు. దీంతో, లక్నోకి చెందిన సయ్యద్ రిజ్వాన్ అనే లాయర్ ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆమె ట్వీట్ దేశ ప్రతిష్ఠను దిగజార్చడమే కాకుండా, దేశ ధిక్కారం కిందకు కూడా వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది.