రాజీనామా వార్తలు పుకార్లే: కాంగ్రెస్ నేత, సినీ నటి రమ్య

షార్ట్స్‌లో చూడండి
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం చీఫ్ పదవికి రాజీనామా చేసినట్టు వస్తున్న వార్తలపై ఆ పార్టీ మాజీ ఎంపీ, సినీ నటి రమ్య (దివ్యస్పందన) స్పందించారు. అవన్నీ పుకార్లేనంటూ ఆమె కొట్టిపారేశారు. తాను ప్రస్తుతం సెలవులో ఉన్నానని... గురువారం నాటికి ఆఫీసుకు వస్తానని తెలిపారు.

రాఫెల్ ఒప్పందం నేపథ్యంలో... మోదీ ఒక దొంగ అంటూ ఆమె ట్వీట్ చేశారు. ఓ ఫొటోను కూడా దానికి జతచేశారు. దీంతో, లక్నోకి చెందిన సయ్యద్ రిజ్వాన్ అనే లాయర్ ఆమెపై ఫిర్యాదు చేశారు. ఆమె ట్వీట్ దేశ ప్రతిష్ఠను దిగజార్చడమే కాకుండా, దేశ ధిక్కారం కిందకు కూడా వస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో, ఆమెపై దేశద్రోహం కేసు నమోదైంది.
Go Back to Shorts
divya spandana
congress
actor

More Telugu News