Belaku: మోదీ నుంచి అభినందనలు అందుకున్న ఈ 'బెలకు' ఎవరు చెప్మా?

  • మోదీ నుంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు అందుకున్న 'బెలకు'
  • ఓ వ్యక్తి ట్వీట్ కు మోదీ స్పందన
  • కన్నడనాట 'బెలకు' అంటే కాంతి అని అర్థం
"నా ఆశీర్వాదాలను 'బెలకు'కు తెలియజేయండి. ఆమె ఆరోగ్యం, సంతోషం కోసం నేను ప్రార్థిస్తున్నాను" అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పెట్టిన ఈ ట్వీట్ వైరల్ కాగా, ఆ 'బెలకు' ఎవరో తెలుసుకునేందుకు నెటిజన్లు సెర్చింగ్ ప్రారంభించారు.

 ప్రధాని నరేంద్ర మోదీని ట్యాగ్ చేస్తూ, "ఇవాళ నా కుమార్తె బెలకు పుట్టిన రోజు. పుట్టినరోజు కానుకగా ఏం కావాలని అడిగితే, తనకు బర్త్ డే కేక్ మీద మోదీ ఫొటో కావాలని కోరింది. ప్రధాని మోదీ ఓ దొంగే. ఆయన చిన్నారుల హృదయాలను సైతం దోచుకున్నారు" అంటూ మహేష్ విక్రమ్ హెగ్డే అనే వ్యక్తి పెట్టిన ట్వీట్, మోదీకి చేరగా ఆయన స్పందించారు. దీంతో పలువురు 'బెలకు' అన్న పదానికి అర్థమేంటని వెతుకులాట ప్రారంభించారు. కాగా, కన్నడనాట 'బెలకు' అంటే కాంతి అని అర్థం.
Belaku
Karnataka
Narendra Modi
Light
Twitter

More Telugu News