ntr: 'అరవింద సమేత'లో అల్లరి పాళ్లే ఎక్కువ .. హింస తక్కువేనట

షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ .. పూజా హెగ్డే జంటగా 'అరవింద సమేత వీర రాఘవ' చిత్రం నిర్మితమైంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడు. ఈ సినిమాకి సంబంధించి జరిగిన ప్రచారం వలన .. ప్రీ రిలీజ్ వేడుక సమయంలో టీవీల్లో ప్రసారం చేసిన విజువల్స్ వలన హింస చాలా ఎక్కువగా ఉందని చాలామంది అనుకున్నారు.

 కానీ ఇదే వేదికపై రిలీజ్ చేసిన ట్రైలర్ వలన, ఈ సినిమాలో లవ్ ..  కామెడీ .. ఎమోషన్స్ కి కూడా మంచి ప్రాధాన్యతను ఇచ్చినట్టుగా అర్థమైంది. ఫస్టాఫ్ అంతా కూడా ఎన్టీఆర్ .. పూజా హెగ్డే .. ఈషా రెబ్బా కాంబినేషన్లో లవ్ .. రొమాన్స్ .. కామెడీ ఎక్కువగా వుంటుందట. ఇంటర్వెల్ తరువాత నుంచి ఫ్యాక్షన్ వాతావరణం కనిపించినా, ఆ యాక్షన్ ను ఎన్టీఆర్ ఎమోషన్ గా మార్చేస్తాడని అంటున్నారు. ఎప్పటిమాదిరిగానే ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించడానికి త్రివిక్రమ్ తనవంతు కృషి చేశాడనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. 
Go Back to Shorts
ntr
pooja hegde

More Telugu News