Tirumala: తిరుమల సంగతి తేల్చేందుకు హైదరాబాద్ వచ్చా: బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి

  • ఈ ఉదయం హైదరాబాద్ వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి
  • న్యాయ విద్యార్థితో కలసి రిట్ పిటిషన్
  • టీటీడీ నిధుల దుర్వినియోగంపై విచారణ కోరుతూ పిటిషన్
తిరుమల  తిరుపతి దేవస్థాన బోర్డు (టీటీడీ)లో జరుగుతున్న అక్రమాలపై పోరాడేందుకు తాను హైదరాబాద్ కు వచ్చినట్టు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేసిన ఆయన, "నేను ఇవాళ హైదరాబాద్ లో ఉన్నాను. న్యాయవాద విద్యను అభ్యసిస్తున్న సత్యా సభర్వాల్ తో కలసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నేను రిట్ పిటిషన్ దాఖలు చేశాను. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డును ప్రభుత్వ నియంత్రణ నుంచి తప్పించాలని కోరుతున్నాం. దేవాలయ నిధుల దుర్వినియోగంపైనా విచారణకు డిమాండ్ చేస్తున్నాం. కేసు విచారణ తేదీ త్వరలోనే వెల్లడవుతుంది" అని ఆయన అన్నారు. 
Tirumala
Tirupati
TTD
Subrahmanya Swamy

More Telugu News