konda surekha: తాను పోటీ చేయనున్న నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చిన కొండా సురేఖ!

  • పరకాల నుంచే పోటీ చేస్తా
  • ఆడ బిడ్డగా నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తా
  • అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తా
టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి, సొంత గూడైన కాంగ్రెస్ పార్టీలో చేరిన కొండా సురేఖ... తాను పోటీ చేయబోయే నియోజకవర్గంపై క్లారిటీ ఇచ్చారు. పరకాల ప్రజల ఆడబిడ్డగా, వారి ప్రేమాభిమానాలతో ఇక్కడ నుంచే పోటీ చేస్తానని ఆమె స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలతో కలసి ప్రచారం నిర్వహిస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో మహాకూటమి అధికారంలోకి వస్తుందని ఆమె తెలిపారు. ఆత్మకూరులో మీడియాతో మాట్లాడుతూ, ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

పరకాల నుంచి తాను పోటీ చేస్తానని తెలుసుకున్న అభిమానులు, పార్టీ కార్యకర్తలు, మహిళా సంఘాలు, పార్టీలకు అతీతంగా ప్రజలు, విద్యార్థులు తనను కలుస్తున్నారని సురేఖ చెప్పారు. పరకాలలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని తెలిపారు. 24 గంటలు ప్రజలకు అండగా ఉండి, ఒక ఆడ బిడ్డగా వారికి సేవ చేస్తానని చెప్పారు. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని తెలిపారు.
konda surekha
parakala
congress

More Telugu News