Jagan: అరాచక పాలన పోయి.. స్వర్ణయుగం రావాలంటే జగన్ సీఎం కావాలి: నటుడు పృథ్వి

  • వచ్చే ఎన్నికల్లో వైసీపీని గెలిపించాలి
  • జగన్ ను సీఎం చేసేందుకు వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా పని చేయాలి
  • జగన్ ను ముఖ్యమంత్రిని చేసి రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలి
రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలంటే, ప్రజల కష్టాలు పోవాలంటే రానున్న ఎన్నికల్లో వైసీపీనే గెలిపించాలని సినీ నటుడు పృథ్వి అన్నారు. 'రావాలి జగన్.. కావాలి జగన్' కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని ఖద్దూస్ నగర్, కేదారేశ్వరపేటలోని పలు వీధుల్లో ఆయన వైసీపీ తరపున ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో నెలకొన్న అరాచక పాలనను అంతం చేసేందుకు వైసీపీ శ్రేణులంతా ఉత్సాహంగా పని చేయాలని చెప్పారు. జగన్ ను సీఎం చేసి రాజన్న రాజ్యాన్ని తీసుకురావాలని కోరారు. వైయస్ స్వర్ణయుగం జగన్ తోనే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్, వైసీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Jagan
pruthvi
tollywood
YSRCP
Vijayawada

More Telugu News