KTR: వెంకయ్యనాయుడు కొడుకుతో కేటీఆర్ వ్యాపార భాగస్వామి!: మధుయాష్కీ

  • అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబ ఆస్తులు బయటపెడతాం 
  • లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేస్తా
  • వందల కోట్లతో విలాసవంతమైన ఇళ్లు కట్టుకున్నారు
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ కుటుంబ ఆస్తులను బయటపెడతామని ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీగౌడ్ హెచ్చరించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొడుకుతో కేటీఆర్ వ్యాపార భాగస్వామిగా ఉన్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ ఆంధ్రావాళ్లతో వ్యాపారం చేస్తే తప్పులేదు కానీ, తాము టీడీపీతో పొత్తుపెట్టుకుంటే తప్పా? అని మధుయాష్కీ ప్రశ్నించారు.

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తానని వెల్లడించిన ఆయన కాంగ్రెస్, టీడీపీల పొత్తుపై విమర్శలు చేస్తున్న కేటీఆర్‌పై మండిపడ్డారు. వందల కోట్ల రూపాయలతో విలాసవంతమైన ఇళ్లు కట్టుకున్న టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలకు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు మాత్రం స్థలం దొరకడం లేదా? అని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చలేని కేసీఆర్ ముందుగానే అసెంబ్లీని రద్దుచేసి అసమర్థతను చాటుకున్నారని మధుయాష్కీ ఎద్దేవా చేశారు. 
KTR
kcr
madhu yashki goud
congress party

More Telugu News