lazor physics: భౌతికశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం

  • ‘లేజర్ ఫిజిక్స్’ లో సంచలనాత్మక ఆవిష్కరణలు
  • ఆప్టికల్ ట్వీజర్స్ ను కనుగొన్న ఆష్కిన్ కు ‘నోబెల్’
  • మౌరౌ, స్ట్రిక్లాండ్ కు సంయుక్తంగా పురస్కారం
భౌతికశాస్త్రంలో జరిపిన పరిశోధనలకు గాను ఈ ఏడాది ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ పురస్కారం వరించింది. 2018- నోబెల్ పురస్కారాలను రాయల్ స్వీడిష్ అకాడమీ ప్రకటించింది. ‘లేజర్ ఫిజిక్స్’లో చేసిన సంచలనాత్మక ఆవిష్కరణలకు గాను ఆర్థర్ ఆష్కిన్ (అమెరికా), గెరార్డ్ మౌరౌ (ఫ్రాన్స్), డొన్నా స్ట్రిక్లాండ్ (కెనడా)కు సంయుక్తంగా నోబెల్ పురస్కారాన్ని ప్రకటించింది. భౌతికశాస్త్రంలో నోబెల్ పురస్కారం అందుకోనున్న మూడో మహిళ గా డొన్నా స్ట్రిక్లాండ్ రికార్డుల కెక్కారు.

వైరస్ కణాలను కనుగొనే ఆప్టికల్ ట్వీజర్స్ ను ఆష్కిన్ కనుగొన్నారు. మౌరా, స్ట్రిక్లాండ్ కనుగొనిన టెక్నిక్ ను కంటి శస్త్ర చికిత్సకు ఉపయోగిస్తున్నారు. కాగా, భౌతికశాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకుంటున్న మూడో మహిళగా డొన్నా స్ట్రిక్లాండ్ రికార్డు సృష్టించారు. ఇదిలా ఉండగా, రసాయనశాస్త్రంలో నోబెల్ పురస్కారాలను రేపు ప్రకటించనున్నారు. ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతి ప్రకటించడం లేదని జ్యూరీ ప్రకటించింది. 1949 తర్వాత మళ్లీ ఇప్పుడే సాహిత్యంలో నోబెల్ ఇవ్వడం లేదని చెప్పింది.
lazor physics
nobel prize

More Telugu News