vijayashanthi: అప్పట్లో ఆరోగ్యం సీరియస్ అయింది.. సర్జరీ కూడా జరిగింది: విజయశాంతి

  • ఉద్యమ సమయంలో ఆరోగ్యం దెబ్బతింది
  • కోలుకోవడానికి రెండేళ్ల సమయం పట్టింది
  • 2014లో నా ఓటమికి కొన్ని దుష్ట శక్తులే కారణం
2014 ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయిన కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి... ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యారు. కాంగ్రెస్ గెలుపే తన లక్ష్యమని చెబుతున్న ఆమె... క్రియాశీలక రాజకీయాల్లోకి పునరాగమనం చేశారు. ఈ సందర్భంగా ఓ మీడియా ఛానల్ తో ఆమె మాట్లాడుతూ, 2014లో తన ఓటమికి కొన్ని దుష్ట శక్తులే కారణమని చెప్పారు.

ఉద్యమ సమయంలో తన ఆరోగ్యం దెబ్బతిన్నదని, అయితే అనారోగ్యాన్ని తాను పట్టించుకోలేదని తెలిపారు. ఎన్నికల తర్వాత ఆరోగ్య పరిస్థితి విషమించిందని, ఒక సర్జరీ కూడా జరిగిందని, మళ్లీ కోలుకోవడానికి రెండేళ్ల సమయం పట్టిందని చెప్పారు. కాంగ్రెస్ విజయం కోసం అన్ని మండలాల్లో తిరుగుతానని తెలిపారు. ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మరించారని... ఆ హామీలనే ప్రధానాస్త్రాలుగా చేసుకుని ప్రజల్లోకి వెళతామని చెప్పారు.
vijayashanthi
TRS
congress

More Telugu News