Vijay Devarakonda: నా సినిమాను ఆపేందుకు కొన్ని దుష్ట శక్తులు కుట్ర చేస్తున్నాయి!: విజయ్ దేవరకొండ

  • 'నోటా' విడుదల కాకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు 
  • హైదరాబాద్ లో ఆరోపించిన విజయ్
  • సినిమా చూసి ఎవరూ 'నోటా' నొక్కరని వ్యాఖ్య
తన కొత్త సినిమా 'నోటా' విడుదల కాకుండా చూసేందుకు కొన్ని దుష్ట శక్తులు కుట్ర చేస్తున్నాయని నటుడు విజయ్ దేవరకొండ సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంటూ 'పబ్లిక్ మీట్' పేరిట ఫ్యాన్స్ లోకి వెళుతున్న ఆయన, హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు.

 ఏపీలో తన తొలి 'పబ్లిక్ మీట్'కు మంచి స్పందన వచ్చిందని చెప్పిన విజయ్, ఈ సినిమా రిలీజ్ ను ఆపేందుకు చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించాడు. ఎన్నికల సమయంలో సినిమా వస్తుండటంతో, ఇది చూసే ప్రేక్షకులు 'నోటా' బటన్ నొక్కుతారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ఇందులో అటువంటి విషయాలేవీ ఉండవని అన్నాడు.
Vijay Devarakonda
NOTA
Movie

More Telugu News