రెండు భాగాలుగానే 'ఎన్టీఆర్' బయోపిక్?
- షూటింగు దశలో 'ఎన్టీఆర్' బయోపిక్
- ప్రధానమైన పాత్రల్లో ముఖ్య తారాగణం
- బాలయ్యతో చర్చించిన క్రిష్
ఇలా ఈ సినిమాకి సంబంధించి ముఖ్యమైన తారాగణం పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో రెండున్నర గంటల్లో 'ఎన్టీఆర్ ' కథను చెప్పడం కష్టమేననే విషయం క్రిష్ కి స్పష్టమైపోయిందట. ఒకవేళ రెండున్నర గంటల్లోనే అవ్వగొట్టేద్దాం అనుకుంటే అభిమానులు నిరాశ చెందే అవకాశాలు ఎక్కువ అని భావిస్తున్నాడట. తాజాగా ఈ విషయం గురించి బాలకృష్ణతో చర్చించిన ఆయన, రెండు భాగాలుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.