Tirumala: శ్రీవారి భక్తులకు హెచ్చరిక... తిరుమలలో స్వైన్ ఫ్లూ!

  • ఇప్పటికే ఒకరు చనిపోయారు
  • డిసెంబర్ వరకూ వ్యాధి ప్రభావం అధికం
  • అందుబాటులో వాక్సిన్ ఉందంటున్న ఐపీఎం డైరెక్టర్
తిరుమలలో స్వైన్ ఫ్లూ ప్రభావం అధికంగా ఉన్నందున, ప్రస్తుతానికి తిరుపతి పర్యటనలను భక్తులు వాయిదా వేసుకోవాలని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. తిరుమలలో వ్యాధి ప్రభావం అధికంగా ఉందని, ఇప్పటికే ఒకరు చనిపోయారని గుర్తు చేసిన నల్లకుంట ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్, ఐపీఎం డైరెక్టర్ డాక్టర్ కే శంకర్, అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ ఈ వ్యాధి ప్రభావం అధికమని అన్నారు.

వ్యాధి సోకినట్టు అనుమానం వస్తే నారాయణగూడలోని ఐపీఎం, నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో మాత్రమే నిర్ధారించే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఎవరికైనా స్వైన్ ఫ్లూ సోకితే నివారణా ట్యాబ్ లెట్లు, వాక్సిన్లు అందుబాటులో ఉంచామని అన్నారు.
Tirumala
Tirupati
Swine flu

More Telugu News